సరిగమ చేతికి ‘చిత్రలహరి’ ఓవర్సీస్ హక్కులు !

సరిగమ చేతికి ‘చిత్రలహరి’ ఓవర్సీస్ హక్కులు !

Published on Dec 11, 2018 8:47 PM IST

sai dharam tej3

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న ‘చిత్రలహరి’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈచిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు మంచి ధరకు అమ్ముడైయ్యానని సమాచారం. కోటి రూపాయలకు సరిగమ సినిమాస్ ఈ హక్కులను దక్కించుకుంది. గతంలో ఈ సంస్థ విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ను ఓవర్సీస్ లో విడుదల చేసి మంచి లాభాలను రాబట్టుకుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నచిత్రలహరికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది. ఇక ఇటీవల వరుస పరాజయాలతో కొనసాగుతున్న తేజు ఈ చిత్రం ఫై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

తాజా వార్తలు