టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్స్ హవా కంటిన్యూ అవుతోంది. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇద్దరు రెండు మల్టీస్టారర్ సినిమాలు చెయ్యబోతున్నారు. ఈ సినిమాల కంటే ముందు నాగార్జున- నాని కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈనెల 24 ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఆదిత్య శ్రీ రామ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు.
ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందించబోతున్నాడు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలో అన్ని విషయాలు చిత్ర యూనిట్ మీడియాకు తెలుపనున్నారు. ప్రస్తుతం నాగార్జున రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.


