సమంత.. పాలిటిక్స్.. అంతా ఒట్టిదే !

31st, January 2018 - 05:35:29 PM

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో వివాహం తర్వాత కొంతకాలం సినిమాల సంఖ్యను తగ్గించిన మాట వాస్తవమే. పైగా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఇంతకు ముందుకంటే ఎక్కువగానే పాల్గొంటున్నారామె. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే పుకార్లు బయలుదేరాయి. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి టి.ఆర్.ఎస్ పార్టీ ఆమెకు 2019 ఎన్నికలకు సికింద్రాబాద్ నియోజకవర్గం తరపున టికెట్ ఆఫర్ చేస్తోందని కూడా అన్నారు.

కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవన్నీ ఒట్టి పుకార్లేనని, వాటిలోని ఏ ఒక్క వార్తలో కూడా నిజం లేదని, సమంతకు అసలు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదని ఆమె సన్నిహిత వ్యక్తులు చెబుతున్నారట. ఇకపోతే ప్రస్తుతం సమంత తెలుగులో ‘రంగస్థలం, మహనటి’, తమిళంలో ‘ఇరుంబు తిరై, సూపర్ డీలక్స్’ చేస్తూనే ‘యూ టర్న్’ చిత్ర రీమేక్ కు సిద్దమవుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు.