నాగార్జున చేయనున్న వెబ్ సిరీస్ పై క్లారిటీ ఇదే!

నాగార్జున చేయనున్న వెబ్ సిరీస్ పై క్లారిటీ ఇదే!

Published on Dec 15, 2022 2:37 PM IST

ది ఘోస్ట్ పరాజయం తర్వాత అక్కినేని నాగార్జున ఇంకా సినిమా ప్రకటించలేదు. ఈ నెల18న ముగియనున్న బిగ్ బాస్ 6 షోకి తుది మెరుగులు దిద్దుతున్నాడు. నెట్‌ఫ్లిక్స్ కోసం నాగ్ ఒక వెబ్ సిరీస్‌ను ఓకే చేసినట్లు, అతను ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభిస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే ఆయన ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేయలేదని, ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. రచయిత ప్రసన్నకుమార్ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేయనున్నాడు. అందుకే ఆ సినిమాకి సంబంధించిన ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే, వచ్చే సీజన్‌లో కొత్త హోస్ట్‌ని తీసుకురానున్నారు కాబట్టి ఇకపై బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసే అవకాశం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు