‘తెనాలి రామకృష్ణ’కి ఇంట్రస్టింగ్ క్లైమాక్స్ !

Published on Nov 12, 2019 4:47 pm IST

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్‌ తో అంచనాలను పెంచిన ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ చాల బాగా వచ్చిందట. ముఖ్యంగా సందీప్ కిషన్ విలన్స్ పై తన వ్యూహాలను ఉపయోగించే విధానం, అలాగే క్లైమాక్స్ లో ప్రధానంగా వచ్చే స్కూటర్ ఎపిసోడ్‌ బాగా నవ్విస్తాయని తెలుస్తోంది. అదే విధంగా ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు చాలా కొత్తగా కూడా అనిపిస్తోందట.

కాగా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ కామెడీ ఎంటర్టైనర్. ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సారి సాలిడ్ హిట్ కోసం సందీప్ ఈ కామెడీ సినిమా చేస్తున్నాడు. హ‌న్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :