మహేష్ వెర్సెస్ బన్నీ.. పోటీ ఎలా ఉన్నా ప్రేక్షకులకి మాత్రం పండగే

Published on Oct 22, 2019 12:31 am IST

‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ బాబు, ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ ఒకేరోజు జనవరి 12న పోటీ పడనున్నారు. దీంతో సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఈ పోటీతో ఓపెనింగ్స్ దెబ్బతింటాయని బయ్యర్లు కంగారుపడిపోతున్నారు. రిలీజ్ డేట్స్ ప్రకటించి పోటీకి తెర తీసిన నిర్మాతలు, హీరోలు సైతం ఒకింత గుబులుగానే ఉండి ఉంటారు. ఇక ఆయా హీరోల అభిమానుల సంగతి చప్పనక్కర్లేదు. ఎవరికి వారు తమ హీరో సినిమానే హిట్టవ్వాలని ప్రార్థిస్తున్నారు.

ఈ పరిస్తితుల నడుమ కామన్ ఆడియన్స్ మాత్రం భలే భలే అంటూ చప్పట్లు కొట్టేస్తున్నారు. ఎందుకంటే పండక్కి వారికి రెండు ఆప్షన్స్ దొరికాయి కాబట్టి. ఇంతకుముందు చాలాసార్లు నిర్మాతల మధ్యన జరిగే సర్దుబాట్లతో పండక్కి భారీ చిత్రం ఒకే ఒక్కటి విడుదలయ్యేది. దాంతో ఆసక్తి ఉన్నా లేకపోయినా ఒకసారి చూసిన సినిమానే రెండోసారి చూడాల్సి వచ్చేది.

కానీ ఈసారి అలా కాదు కదా. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు దిగుతున్నాయి. రెండు రోజులు రెండు కొత్త సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఇలా సంక్రాంతిని ఇద్దరు స్టార్ హీరోలు పంచే వినోదంతో ఎంజాయ్ చేసే ఛాన్స్ ప్రేక్షకులకు ఎప్పుడో కానీ రాదు. అందుకే వసూళ్ల మధ్య పోటీ ఉంటుందని తెలిసినా రెండూ ఒకేసారి వస్తే బాగున్న సినిమానే ఆడుతుంది. ఒకవేళ రెండూ బాగుంటే రెండూ ఆడుతాయి. అసలు ఇలాంటి పోటీ ఉనప్పుడే కదా మంచి సినిమాలు వచ్చేది అంటున్నారు కామన్ ఆడియన్స్.

సంబంధిత సమాచారం :

X
More