మోహన్ బాబు హౌస్ అరెస్ట్ కు పోలీసుల యత్నం !

మోహన్ బాబు హౌస్ అరెస్ట్ కు పోలీసుల యత్నం !

Published on Mar 22, 2019 9:04 AM IST

Mohanbabu

ప్రముఖ సినీ నటులు, శ్రీ విద్యానికేతన్ కలశాలల అధినేత మోహన్ బాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఫీజ్ రీఎంబెర్స్మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని అందుకు నిరసనగా ఇవాళ ర్యాలీకి పిలుపునిచ్చారు మోహన్ బాబు. తిరుపతిలో ఉదయం 10గంటలకు వేలాది మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీకి ప్లాన్ చేసారు, అయితే ఈ ర్యాలీ జరగకుండా ఆపేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఉదయం 7గంటలకే విద్యానికేతన్ కాలేజీ ఎదుట భారీగా పొలిసు బలగాలను మోహరించారు, మోహన్ బాబు ఇంటిని చుట్టూ ముట్టి ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

అయితే మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ ని కొసాగించి తీరుతానని ఈ నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అయన అంటున్నారు.

తాజా వార్తలు