సల్మాన్ ఖాన్ కి కోర్ట్ హెచ్చరిక

సల్మాన్ ఖాన్ కి కోర్ట్ హెచ్చరిక

Published on Jul 4, 2019 11:55 PM IST

సల్మాన్ ఖాన్ ని కృష్ణ జింకల వేటాడిన కేసు ఏళ్లతరబడి వెంటాడుతూనే ఉంది . 1998 లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ కొరకు రాజస్థాన్ లో ని జోధాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిత్ర బృందం లో ఒకరైన సల్మాన్ ఖాన్ పై గన్ తో కృష్ణ జింకలను వేటాడి చంపాడనే అభియోగం మోపబడింది.ఈ కేసులో పలుమార్లు సల్మాన్ కి కోర్ట్ శిక్ష ఖరారు చేయగా, ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయటతిరుగుతున్నారు. తాజాగా ఈ కేసు విచారణ నిమిత్తం నిన్న కోర్ట్ కి హాజరుకావలసివుండగా సల్మాన్ విచారణకు హాజరుకాకపోవడటంతో కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం జరగనున్న విచారణకు హాజరుకాని పక్షంలో బెయిల్ రద్దు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు లో కూడా విచారణ ఎదుర్కొన్నారు. 2002లో రోడ్ ప్రక్కన నిద్రిస్తున్న వారిపైనుండి కారు నడిపి ఒకరి మృతికి,అలాగే ముగ్గురు కి తీవ్ర గాయాలు కావడానికి కారణమయ్యారనే అభియోగాలు ఆయన పై వచ్చాయి. కానీ ఆధారాలు లేని కారణంగా ఈ కేసు ని కొట్టివేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు