క్రేజీ బయోపిక్ కూడా ఓటీటీలో రాబోతోందా ?

Published on Sep 21, 2020 7:01 am IST

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధం అయినట్లు బాలీవుడ్ మీడియాలో తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ, కరోనా మహమ్మారి రాకతో కపిల్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమేయ్యేలా కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చింది అని.. ఈ సినిమా మేకర్స్ కూడా ఓటీటీకి తమ సినిమాని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారని.. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రాబోతోందని సమాచారం.

ఇక ఈ సినిమాలో మొత్తం 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను అప్పటి నేపథ్యం తాలూకు విజువల్స్ ఎక్కువగా ఉంటాయని.. ప్రేక్షకులను 80 నాటి కాలంలోకి తీసుకువెళ్లాలన్నా.. సినిమాలోని ఫీల్ ను వాళ్లు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలన్నా.. థియేటర్ అయితే బాగుంటుందని ఇన్నాళ్ళు రిలీజ్ ను ఆపారు మేకర్స్. కానీ కరోనా ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకున్నారట.

సంబంధిత సమాచారం :

More