క్రేజీ బజ్ : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్ ?

క్రేజీ బజ్ : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ లాక్ ?

Published on Mar 27, 2024 8:30 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈమూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.

విషయం ఏమిటంటే, అందరూ ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుండగా తాజాగా దీని రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. తాజా టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీని 2024 అక్టోబర్ 31న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు గేమ్ ఛేంజర్ లో కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు