‘క్రేజీ కళ్యాణం’ టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్

‘క్రేజీ కళ్యాణం’ టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్

Published on Jan 5, 2026 4:09 PM IST

crazy kalyanam

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్-2గా, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల ఈ చిత్రానికి కథ, కథనాన్ని అందిస్తున్నారు.

పెళ్లి నేపథ్యంగా సాగుతూ వినోదంతో పాటు ఆసక్తికరమైన మలుపులు ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘క్రేజీ కల్యాణం’ చిత్రీకరణ తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో జరగడం విశేషం. త్వరలోనే సినిమా సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిత్రాలకు సంగీతం అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేష్ బొబ్బిలి, ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద, వినోదం ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు