బన్నీ సినిమాలో రణవీర్ సింగ్ ?

బన్నీ సినిమాలో రణవీర్ సింగ్ ?

Published on May 22, 2023 8:59 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ‘పుష్ప 2’ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. పుష్ప 2 లో ఓ అతిధి పాత్ర ఉంది అని, ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కనిపించే చాన్స్ ఉందని టాక్. మరి ఈ రుమార్ నిజం అయితే.. పుష్ప 2 కి బాలీవుడ్ లో మరింత గిరాకీ పెరుగుతుంది.

ఇంతకీ రణవీర్ సింగ్ ఏ పాత్రలో కనిపించనున్నారో తెలుసా?, బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడని.. గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా రణవీర్ సింగ్ రోల్ నిలుస్తోందని.. పైగా ఈ పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు