“ఆదిపురుష్” రిలీజ్ పై క్రేజీ రూమర్స్..కానీ ఎంతవరకు నిజం?

“ఆదిపురుష్” రిలీజ్ పై క్రేజీ రూమర్స్..కానీ ఎంతవరకు నిజం?

Published on Jan 18, 2022 5:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం అయినటువంటి భారీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఇండియా లోనే బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ గా రిలీజ్ కానుంది. అయితే ఆల్రెడీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించే పనిలో ఉన్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాపై గత కొన్ని వారాల కితం ఒక సెన్సేషనల్ బజ్ బయటకొచ్చి వైరల్ అయ్యింది. మళ్ళీ అదే రూమర్స్ మరింత వినిపిస్తున్నాయి. అదే ఈ సినిమా రిలీజ్ పై.. ఈ చిత్రాన్ని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 20 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని అందులో ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారని ఓ టాక్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అన్ని థియేటర్స్ లో ఏమో కానీ ఇంగ్లీష్ రిలీజ్ పరిశీలనలో అయితే మేకర్స్ ఉన్నారట. కానీ 20 వేల థియేటర్స్ రిలీజ్ అనేది ప్రస్తుతానికి అవాస్తవం అని తెలుస్తుంది. మరి రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాలో ప్రభాస్ రామునిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు