యంగ్ హీరో సినిమాకి క్రేజీ టైటిల్ !

Published on Nov 30, 2020 11:30 am IST

సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా అది. విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న ఆ సినిమాలో నాగశౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ కనిపించనున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ఫిక్స్ ఆయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఆర్చరీ అని పెట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ప్రీ లుక్‌ ను ‘ది గేమ్‌ విల్‌ నెవర్‌ బీ ది సేమ్‌’ అనే క్యాప్షన్‌తో ఆ మధ్య విడుదల చేసింది చిత్రబృందం. ఈ లుక్ లో నాగశౌర్య బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ గా ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య మాస్ హీరో లుక్ లో పర్ఫెక్ట్ బాడీతో మెస్మరైజ్ చేశాడు.

కాగా మునుపెన్నడు చూడని విధంగా సిక్స్‌ ప్యాక్‌ డిఫరెంట్‌ లుక్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఈ మూవీలో నాగ శౌర్యకు జంటగా నటిస్తున్నారు. మరి ఈ ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో నాగ శౌర్య విలుకాడిగా ఎలా ఉంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More