శరవేగంగా పూర్తైన ధనుష్ గ్యాంగ్‌స్టర్ చిత్రం

Published on Feb 9, 2020 8:59 pm IST

భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఈయనకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అయన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ప్రస్తుతం ఈయన ధనుష్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతేడాది మొడలైన ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా ముగిసింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఈ ఫిబ్రవరి 19వ తేదీన తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ధనుష్ గత చిత్రం ‘అసురన్’ గ్రాండ్ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండనుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :