పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన పాత్రల్లో వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వచ్చిన ‘దండుపాళ్యం’ సినిమా ఎంతటి సాధించిందో తెలిసిందే. ఆ తరువాత విడుదలైన ‘దండుపాళ్యం 2’ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేదు. ఇప్పుడు ఈ సిరీస్లో మూడవ భాగంగా తెరకెక్కిన ‘దండుపాళ్యం 3’ మార్చి 2 న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడ మంచి స్పందన లభించింది.
దండుపాళ్యం పార్ట్ 1, 2 కంటే పార్ట్ 3 లో సన్నివేశాలు మరింత తీవ్రంగా ఉంటాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. ఈ సినిమా దండుపాళ్యం సీరిస్ లో చివరి పార్ట్ కావడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగానే ఉంది. మొదటి రెండు భాగాల కంటే ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ రాజు అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించాడని కన్నడ సినీ వర్గాల సమాచారం. ఈ మూవీ రిలీజ్ తరువాత శ్రీనివాస్ రాజు తెలుగు యంగ్ హీరో శర్వానంద్ ను డైరెక్ట్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.


