జపాన్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న “దర్బార్”.!

Published on Jul 25, 2021 3:10 pm IST


వరల్డ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “దర్బార్”. స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే మన దగ్గర యావరేజ్ గానే నిలిచినా రజినీ స్టామినాతో మంచి వసూళ్లనే అన్ని చోట్లా రాబట్టేసింది.

అయితే ఈ చిత్రం గత కొన్ని రోజులు కిందటే జపాన్ దేశంలో కూడా విడుదల అయ్యిందని తెలిపాము. మరి అప్పటికే రజినీ సినిమాకి భారీ క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ అయ్యిన రోజుకే మూడు రోజులు హౌస్ ఫుల్స్ పడ్డాయి. అయితే తలైవర్ మాస్టర్ స్ట్రోక్ ఇంకా ఆగిపోలేదట భారీ వసూళ్లతో అక్కడ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం 230 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు పదిహేనున్నారా కోట్లు వసూలు చేసిందట. ఇప్పటికే జపాన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దర్బార్ ఇండియన్ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ లిస్ట్ లో నాలుగో స్థానంలో ఉన్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో నయన్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :