దసరా టూ సంక్రాంతి.. ఆహాలో సందడి చేసే సినిమాలు ఇవే..!

Published on Oct 13, 2021 2:15 am IST


కరోనా పరిస్థితులు కాస్త చక్కబడుతుండడంతో ఇప్పుడిప్పుడే థియేటర్లలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి తర్వాత ఓటీటీ బాట పడుతుంటే, మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కాగా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సరికొత్త కొత్త వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ అందిస్తున్న “ఆహా” ఈ సారి దసరా నుంచి సంక్రాంతి వరకు మోత మోగించేందుకు రెడీ అయ్యింది.

అయితే ఆహా అందించబోతున్న చిత్రాల జాబితాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల వచ్చిన “లవ్ స్టోరీ” సినిమాతో పాటు, మరికొన్ని విడుదల కాబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే టాక్‌షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఆహాలో విడుదలయ్యే చిత్రాలు:

లవ్‌స్టోరీ, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, మంచి రోజులొచ్చాయి, లక్ష్య, డీజే తిల్లు, అనుభవించు రాజా, రొమాంటిక్‌, పుష్పక విమానం, గని.

ఒరిజినల్స్‌:

సేనాపతి, భామా కలాపం, అన్యస్‌ టుటోరియాల్‌, 3 రోజెస్‌, అడాల్టింగ్‌, ఇట్‌ ఈజ్‌ నాట్‌ ఎ లవ్‌స్టోరీ, ఇంటింటి రామాయణం, సెగు టాకీస్‌, కూబూల్‌ హై, సర్కార్‌ సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :