కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ(ఫాస్) దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేయనున్నారు.
ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను అందజేయనున్నారు. సూపర్ హిట్ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్, పలు సూపర్ హిట్ సినిమాల పి.ఆర్.ఓ, ప్రముఖ నిర్మాత బిఏ. రాజుగారికి దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని అందివ్వనున్నారు. అలాగే దర్శకుడు కోడిరామకృష్ణగారికి, ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు దాసరి కీర్తి కిరీట సిల్వర్ క్రౌన్ అవార్డును అందజేయనున్నారు.
అలాగే డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్(ఫిదా) వార్డును శేఖర్ కమ్ముల, ఉత్తమ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ(లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా. ఎ.నటరాజుకు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకాల సత్యనారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. సభను ప్రారంభిస్తారు.


