చైతూ-సమంతల ప్రేమపై దాసరి సరదా కామెంట్స్!

21st, September 2016 - 05:28:13 PM

dasari
అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య చాలాకాలంగా హీరోయిన్ సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమంత కూడా అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్‌లకు హాజరవుతూ వస్తున్నారు. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్ళి జరగనుంది. ఇక ఇదిలా ఉంటే చైతన్య – సమంతల ప్రేమ గురించి దర్శకరత్న దాసరి నారాయణ రావు సరదాగా కామెంట్ చేశారు. హైద్రాబాద్‌లో నిన్న సాయంత్రం వైభవంగా జరిగిన ప్రేమమ్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి, ఇదే సందర్భంగా చైతూ ప్రేమ గురించి మాట్లాడారు.

“నాగ చైతన్య మన ఇంటిలో కుర్రవాడిలా ఉంటాడు. మాటలతో, నవ్వులతో పడేసే లాస్ట్ బ్రదర్ లాంటి వాడు. చైతూ నవ్వులోనే మాయ ఉంది. ఆ నవ్వుతోనే ఒక హీరోయిన్ని పడేశాడు. అలాగే ‘ఏ మాయ చేశావే’తో ఏం మాయ చేసిందో ఆ హీరోయిన్.. పడిపోయాడు చైతూ..” అంటూ చైతూ-సమంతల ప్రేమ గురించి దాసరి సరదా వ్యాఖ్యలు చేశారు. ఇక దాసరి మాట్లాడుతున్నప్పుడు చైతూ ముసిముసిగా నవ్వుతూ ఉండడం ఈ ఆడియో లాంచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి