చివరి ప్రయాణంలో దాసరిని నిర్లక్ష్యం చేశారట !


ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావుగారి మరణం పరిశ్రమను ఎంతగా కలచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు ఆయన ఆయన మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దాసరికి ప్రియ శిష్యుడు, అత్యంత ఆప్తుడు అయిన మంచు మోహన్ బాబు మాత్రం చివరి ప్రయాణ సమయంలో దాసరిని చాలా మంది నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు.

మోహన్ బాబు మాట్లాడుతూ ‘ఒక గొప్ప వ్యక్తికి జరగాల్సిన అంతిమయాత్ర కాదది. ఆయన ఆసుపత్రి నుండి రాగానే త్వరగా కోలుకోవాలని నేను షిరిడి వెళ్లి విభూతి తీసుకొచ్చాను. కానీ ఆయన ద్వారా ప్రయోజనం పొందినవారు, బ్రేక్ అందుకున్న వాళ్ళు నివాళులర్పించాడనికి కూడా రాలేదు. అందుబాటులో లేని వాళ్ళంటే రాలేకపోయారు. కానీ సిటీలోనే ఉండి కూడా కొందరు రాలేదు’ అన్నారు. అలాగే అంతిమ యాత్ర సయమంలో దాసరిని గౌరవించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.