Dashavatar in Oscars: మరాఠీ సినిమా హిస్టరీ.. ఆస్కార్ లిస్ట్ లో ఎంట్రీ.. విశేషాలు, ఏ ఓటిటిలో చూడొచ్చంటే

Dashavatar in Oscars: మరాఠీ సినిమా హిస్టరీ.. ఆస్కార్ లిస్ట్ లో ఎంట్రీ.. విశేషాలు, ఏ ఓటిటిలో చూడొచ్చంటే

Published on Jan 4, 2026 7:10 PM IST

Dashavatar

ప్రపంచ ప్రఖ్యాత అవార్డులలో ఆస్కార్ అవార్డు కూడా ఒకటి. అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఈ అవార్డు రావడమే ఒక కల అయితే కేవలం ఈ అకాడమీ లిస్ట్ వరకు తమ సినిమా చేరినా దానిని ఎంతో గర్వకారణంగా చాలా మంది భావిస్తారు. అయితే ఈ లిస్ట్ వరకు మన ఇండియన్ సినిమాలు ఇంకా సిరీస్ లు లాంటివి ఇప్పుడిప్పుడే అంచలంచెలుగా వెళుతున్నాయి. RRR సినిమా తర్వాత పలు సినిమాలు ఇండియన్ ఫెడరేషన్ నుంచి కూడా వెళ్లాయి. కానీ లేటెస్ట్ గా ఓ హిస్టారికల్ న్యూస్ బయటకి వచ్చింది.

2026 అకాడమీ లిస్ట్ లో మొదటిసారి ఓ మరాఠీ చిత్రం ఎంపిక

ఎప్పటిలానే ఈసారి కూడా ఆస్కార్ అకాడమీ అవార్డు లిస్ట్ బయటకి వచ్చింది. అయితే ఇండియన్ సినిమా నుంచి చాలానే సినిమాలు పేర్లు వెళ్లాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల సినిమాలు వెళ్లి ఉండొచ్చు కానీ అకాడమీ లిస్ట్ లో ఫైనల్ గా 150 సినిమాలు షార్ట్ లిస్ట్ అయితే అందులో నిలిచిన ఏకైక సినిమాగా మరాఠీ సినిమా నుంచి ‘దశావతార్’ (Dashavatar) నిలిచింది. ఇది కూడా మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ ఎవర్ అకాడమీ ఎంట్రీగా చరిత్ర సృష్టించింది.

Dashavatar Details – ‘దశావతార్’ (Dashavatar) విశేషాలు ఏంటి?

చాలామంది కేవలం హిందీ సినిమా కోసం ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ ఇదే హిందీ సినిమా కూడా ఇవ్వని సాలిడ్ సినిమాలు మరాఠీ సినిమా నుంచి ఉన్నాయి. ఒక తుంబాడ్, సైతాన్ (ఒరిజినల్ ‘వష్’) లాంటి క్రేజీ సినిమాలు వీరి నుంచే వచ్చాయి. ఇలాంటి సినిమాలు అందించిన మరాఠీ సినిమా నుంచి గత ఏడాది వచ్చిన చిత్రమే ఈ “దశావతార్” (Dashavatar).

ఈ చిత్రాన్ని సుబోధ్ ఖనోల్కర్ దర్శకత్వం వహించగా దిలీప్ ప్రభావల్కర్ లీడ్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమా కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద కళ అయిన ‘దశావతారం’ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమా కంటెంట్ తోనే అకాడమీ అవార్డ్స్ లో మెయిన్ ఓపెన్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపిక అయ్యింది.

Dashavatar in which OTT – ఈ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడొచ్చంటే

మరాఠి సినిమా నుంచి చరిత్ర సృష్టించిన ఈ సినిమాని జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు. మరి వీరి సంస్థ ఈ సినిమా ఓటిటి హక్కులు సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ చిత్రం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.

ఇక ఈ సినిమా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ లో ఎంపిక కావడంతో జీ స్టూడియోస్ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు