తెలుగు వరల్డ్ టీవీ ప్రీమియర్ కి రెడీ అయ్యిన “లియో”

తెలుగు వరల్డ్ టీవీ ప్రీమియర్ కి రెడీ అయ్యిన “లియో”

Published on Jan 7, 2024 1:00 PM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “లియో” కోసం తెలిసిందే. మరి విజయ్ లోకేష్ ల కలయికలో ఇది రెండో సినిమా కావడం పైగా ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో కనెక్షన్ ఉంటుందా లేదా అనే అంశంతో భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది.

కానీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు అయితే పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ విజయ్ కెరీర్ లోనే రికార్డు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి నంబర్స్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా అయితే ఫైనల్ గా తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ మరియు టైం ని ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాని సన్ నెట్ వర్క్ వారు సొంతం చేసుకోగా జెమినీ టీవిలో ఈ జనవరి 15న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర కూడా విజయ్ సినిమాలకి మంచి రెస్పాన్స్ ఉంది. మరి లియో కి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు