విజయ్ కెరీర్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ !

విజయ్ కెరీర్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ !

Published on Oct 11, 2026 1:04 PM IST

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఐతే, ‘రణబాలి’ ప్రతి ప్రేక్షకుడికి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని, తనకు సినిమా పై నమ్మకం ఉందని విజయ్ చెప్పుకొచ్చాడు. సినిమా చూసిన తర్వాత మన చరిత్ర, సంస్కృతి గురించి తప్పకుండా మాట్లాడుకుంటారని.. సినిమాలో అంత డెప్త్ ఉందని విజయ్ తెలిపారు.

విజయ్ దేవరకొండ కెరీర్ కి ఈ సినిమా హిట్ కావడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఈ సినిమాపై విజయ్ పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఇక విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మెయిన్ థియేటర్ చైన్‌లలో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్ 50 వేల డాలర్ల మార్కును దాటాయి. రాబోయే రోజుల్లో ప్రీమియర్ వసూళ్లు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి. ఈ సినిమాకి ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందించారు.

తాజా వార్తలు