‘వారణాసి’కి తుది మెరుగులు!?

‘వారణాసి’కి తుది మెరుగులు!?

Published on Oct 11, 2026 3:00 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్టుగా టాక్. ప్రస్తుతం జక్కన్న అండ్ టీం రామోజీ ఫిలిం సిటీలో ‘వారణాసి’కి తుది మెరుగులు దిద్దుతున్నారట.

సో ఈ అక్టోబర్ తో ఈ బిగ్ ప్రాజెక్ట్ పూర్తయినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలెంటెడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే రానున్న ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

తాజా వార్తలు