యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక సెట్ కూడా వేశారట. ఈ సెట్ లో హీరో పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. అన్నట్టు ఎన్టీఆర్ తో పాటు మిగిలిన ప్రధాన తారాగణం పై కూడా ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
కాగా ఎన్టీఆర్ ఊహించని విధంగా గాయానికి లోనైన సంగతి తెలిసిందే. విజయవంతంగా ఎన్టీఆర్ కి సర్జరీ కూడా జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట.


