‘బాలయ్య’ సినిమా పై కొరటాల ఫోకస్ ?

‘బాలయ్య’ సినిమా పై కొరటాల ఫోకస్ ?

Published on Oct 11, 2026 2:00 PM IST

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేస్తారట. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటుల పై ఫోకస్ పెట్టారు. కొన్ని కీలక పాత్రల కోసం ఆడియన్స్ కూడా చేస్తారట. అన్నట్టు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ చివరి దశలో ఉంది. ఇక గాయం నుంచి బాలయ్య కోలుకున్నారు.

ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది. కాగా నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. మరి ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా నేపథ్యం ఏమిటో చూడాలి.

అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు