ఓటిటిలో ‘పఠాన్’ రాకకి డేట్ ఫిక్స్ ?

ఓటిటిలో ‘పఠాన్’ రాకకి డేట్ ఫిక్స్ ?

Published on Mar 15, 2023 10:04 AM IST

ఈ ఏడాది లో 1000 కోట్లు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచిన చిత్రం “పఠాన్”. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ మరియు ఎమోషనల్ చిత్రం ఇది. అయితే ఈ సినిమా షారుఖ్ ఖాన్ నుంచి నెక్స్ట్ లెవెల్ కం బ్యాక్ గా నిలవడమే కాకుండా బాలీవుడ్ సినిమా నుంచి ఎన్నెన్నో రికార్డులు సెట్ చేసింది.

అయితే ఈ సినిమా హిందీలో మరోవైపు ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా మరి ఓటిటి రిలీజ్ పై ప్రస్తుతం ఒక డేట్ బజ్ గా ప్రచారం అవుతోంది. దీని పాన్ ఇండియా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ చిత్రం మార్చి 22 నుండి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుండి కూడా అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు