హిందీలో మరో అసలైన బ్లాస్ట్ కి “పుష్ప” సిద్ధం.!

Published on Feb 4, 2022 12:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నఆ హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ వచ్చి ఆల్రెడీ భారీ హిట్ కాగా రెండో పార్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట రిలీజ్ అయ్యిన పుష్ప పార్ట్ 1 సక్సెస్ అయితే హిందీలో వేరే లెవెల్లో అందుకుంది అని చెప్పాలి.

అయితే ముందే అల్లు అర్జున్ సినిమాలు అంటే హిందీ ఆడియెన్స్ అక్కడి స్టార్ హీరోలతో సమానంగా అదరణగా దక్కుతుంది అని టీవీ మరియు యూట్యూబ్ లో ప్రూవ్ కాగా దానిని మరింత టెస్ట్ చేస్తూ పుష్ప ని హిందీలో రిలీజ్ చేసి బన్నీ తన ఫస్ట్ అటెంప్ట్ లోనే 100 కోట్ల మార్క్ ని అందుకొని సంచలనం రేపాడు. ఇప్పటికీ హవా కొనసాగిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు టెలివిజన్ పై టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే మార్చ్ నెల 20న ఈ చిత్రాన్ని హిందీలో ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు అంటే థియేట్రికల్ రిలీజ్ లేకుండానే భారీ వ్యూవర్ షిప్స్ అనుకునే అల్లు అర్జున్ ఈసారి థియేటర్స్ లో కూడా హిట్ అయ్యి వస్తున్నాడు అంటే పుష్ప బ్లాస్ట్ మరింత స్థాయిలో ఉంటుందని చెప్పాలి. మరి జస్ట్ అప్పుడు వరకు వేచి చూడాలి అంతే.

సంబంధిత సమాచారం :