ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసిన ‘లెనిన్’.. కాలర్ ఎగరేస్తున్న అఖిల్..!

ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసిన ‘లెనిన్’.. కాలర్ ఎగరేస్తున్న అఖిల్..!

Published on Jan 1, 2026 8:03 PM IST

LENIN

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నారు. తొలుత ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా సెలెక్ట్ అయినా, కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోకి మరో బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా జాయిన్ అయింది. అయితే, న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

‘లెనిన్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను 2026 జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కాలర్ ఎగరేస్తూ కనిపించాడు. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజా వార్తలు