వెంకీమామ “సైంధవ్” నుంచి రాంపేజ్ కి డేట్ లాక్.!

Published on Mar 22, 2023 7:17 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ నుంచి కూడా ఒకొకటి గా పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి మొదటగా మెగాస్టార్ “సైరా” తో స్టార్ట్ చేయగా నెక్స్ట్ బాలయ్య అఖండ హిందీ లో కూడా రిలీజ్ అయ్యింది. మరి కొన్నాళ్ల కితమే టాలీవుడ్ ఆల్ టైం అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. మరి వెంకీ మామ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు “హిట్” ఫ్రాంచైజ్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ చిత్రం “సైంధవ్” తో వస్తున్నారు.

మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఇంటెన్స్ గ్లింప్స్ తో స్టార్ట్ కాగా భారీ అంచనాలు దానితో రేపింది. ఇక మేకర్స్ అయితే ఈ ఉగాది కానుకగా ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఇక రేపు మార్చ్ 23 నుంచి అసలు రాంపేజ్ అంటే ఏంటో చూపిస్తామని అనౌన్స్ చేశారు. మరి రేపు ఎలాంటి అప్డేట్ మేకర్స్ నుంచి ఉంటుందో చూడాలి. మరి ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :