‘డియర్ కామ్రేడ్’ పరిస్థితి ఏమిటి ?

Published on Aug 3, 2019 2:00 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మికా మండన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ ఓపెనింగ్స్ తో మొదలైనప్పటికీ.. డివైడ్ టాక్ తో ఆ తరువాత భారీ కలెక్షన్స్ ను రాబట్టడంలో వెనుకపడింది. అయితే ఇప్పటివరకూ డియర్ కామ్రేడ్ కి ఒక్క ఇస్మార్ట్ శంకర్ నుండి మాత్రమే పోటీ కావడంతో ఏ సెంటర్స్ లో.. డియర్ కామ్రేడ్ పర్వాలేదనిపించుకునే కలెక్షన్స్ ను రాబడుతున్నాడు.

కానీ ఈ రోజు రిలీజ్ అయిన ‘రాక్షసుడు’కి మంచి పాజిటివ్ టాక్ రావడం, ఆ సినిమా కూడా ఏ సెంటర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుండటంతో డియర్ కామ్రేడ్ కి ఏ సెంటర్స్ లో కలెక్షన్స్ పడిపోయే అవకాశం ఉంది. ఇక ఎలాగూ బిసి సెంటర్స్ లో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఇస్మార్ట్ కి తోడు ‘గుణ369’ కూడా రావడంతో ఇక ‘బి.సి’ సెంటర్స్ ల్లో డియర్ కామ్రేడ్ ఆశలు వదులుకున్నట్లే.

కాగా మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల భారీ షేర్ వసూలు సాధించిన ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ వద్ద సేవ్ అవ్వాలంటే ఈ వీక్ లో వచ్చే కలెక్షన్స్ చాల కీలకం కానున్నాయి. మరి ‘డియర్ కామ్రేడ్’ సేవ్ అవుతాడా లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :