డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”

Published on Jan 6, 2024 12:36 AM IST


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు లో ప్రసారం అయ్యింది.

ఇందుకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది. ఈ చిత్రం మొదటిసారి 4.35 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది డీసెంట్ రెస్పాన్స్ అని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్, రదన్ లు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు