కెమెరామెన్ తో కళ్యాణ్ రామ్ సినిమా !
Published on Mar 14, 2018 11:42 am IST

‘ఆర్య, అతడు, జల్సా, ఆగడు’ వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన గుహన్ దర్శకుడుగా మారబోతున్నారు. కళ్యాణ్ రామ్ తో ఈయన సినిమా చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. అడ్వెంచరస్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ తాజా సినిమాలు ‘ఎం.ఎల్.ఏ’ మార్చి 30 న విడుదల కాబోతోంది. అలాగే ‘నా నువ్వే’ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాల తరువాత పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు ఈ నందమూరి హీరో. ఈ ప్రాజెక్ట్ తో పాటు గుహన్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ‘ఎం.ఎల్.ఏ’ సినిమా ప్రమోషన్స్ లో కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. 17 న ఈ సినిమా ఆడియో జరగనుంది.

 
Like us on Facebook