సింగం 3 వాయిదాపై స్పందించిన సూర్య !

singam-3
సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సింగం 3’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్త అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ వాయిదా విషయాన్ని హీరో సూర్య స్వయంగా ప్రకటించారు. తమ చేతిలో లేని కొన్ని పరిస్థితుల వలన సినిమా వాయిదా పడిందని, దీని వలన కూడా మంచే జరుగుతుందని, తమకు అందరి సపోర్ట్ కావాలని సూర్య అన్నారు.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కరెన్సీ కొరత ప్రభావం ఇంకా తగ్గనందున పైగా జయలలిత మరణం, తాజాగా సంభవించిన తుఫాన్ ప్రభావం వలన తమిళ ప్రజలు పూర్తిగా కోలుకోకపోవడం వలనే ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ ద్విభాషా చిత్రం డిసెంబర్ 16న సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా రామ్ చరణ్ ‘ధృవ’ కోసం డిసెంబర్ 23కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు ఈ తేదీ కాస్త జనవరి 26 కి మారిందట. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సీక్వెల్ చిత్రంపై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.