ధనుష్ స్పీడ్ మామూలుగా లేదు

Published on Feb 24, 2020 11:19 pm IST

హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో ధనుష్. ప్రజెంట్ ఆయన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కర్ణన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం రూరల్ బ్యాక్ డ్రాప్లో నడిచే గ్యాంగ్ స్టర్ డ్రామాలా ఉండనుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని సినిమా స్టార్ట్ చేయడంతో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఈరోజుతో సెకండ్ షెడ్యూల్ కూడా ముగిసింది. దీంతో సుమారు 90 శాతం చిత్రీకరణ పూర్తైనట్టు ధనుష్ స్వయంగా తెలిపారు. సెల్వరాజ్ మేకింగ్ స్టైల్ పట్ల కూడా ధనుష్ చాలా సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కలైపులి ఎస్. ధాను నిర్మిస్తున్న ఈ చిత్రం పట్ల తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే తన తర్వాతి చిత్రం పూర్తయ్యాక ధనుష్ మరోసారి మారి సెల్వరాజ్ డైరెక్షన్లో ఒక చిత్రం చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More