ఇంట్రెస్టింగ్ గా “సార్” డిలీటెడ్ సీన్.!

Published on Mar 17, 2023 8:01 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం సార్/వాథి. మరి ఈ సినిమాతోనే ధనుష్ తన మొదటి టాలీవుడ్ ఎంట్రీ ని అందించగా తాను అయితే అదిరే వెల్కమ్ ని అందుకున్నాడని చెప్పాలి. ఓ నటుడుగా తన సాలిడ్ పెర్ఫామెన్స్ ని ఈ సినిమాలో చూపించడమే కాకుండా సినిమా కంటెంట్ పరంగా కూడా తాను హిట్ అందుకొని అదరగొట్టాడు.

మరి మేకర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన ఈ సినిమా అయితే ఈరోజు నుంచి ఓటిటి లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మరో పక్క మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ డిలీటెడ్ సీన్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సినిమా క్లైమాక్స్ లో మరో సీన్ లా అయితే ఇది ఉంది. సినిమా స్టార్టింగ్ లో కనిపించే ముగ్గురు కుర్రాళ్లతో సముద్రఖని త్రిపాఠి ఇంస్టిట్యూట్ పై ఈ సీన్ కనిపిస్తూ ధనుష్ బాలు పాత్రని ఎలివేట్ చేసేలా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా నిడివి ఎలాగో తక్కువే కాబట్టి ఈ సీన్ కూడా థియేటర్స్ లో ఉంచాల్సింది. మొత్తానికి అయితే ఈ సీన్ ఆకట్టుకునే రకంగా ఉంది.

సంబంధిత సమాచారం :