ఫిబ్రవరిలో ‘లోకల్ బాయ్’ రానున్న ‘ధనుష్’ !

ఫిబ్రవరిలో ‘లోకల్ బాయ్’ రానున్న ‘ధనుష్’ !

Published on Jan 28, 2020 3:00 AM IST

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ధనుష్ ముందుంటారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో చక్కటి సినిమాతో ‘లోకల్ బాయ్’గా వస్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. జనవరి నెలాఖరున విడుదలకు సిద్ధమైన ‘అశ్వద్ధామ’లో కూడా ఆమె నటించారు. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.

ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు సతీష్ కుమార్ తెలిపారు. నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ “మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. తమిళంలో సంక్రాంతికి విడుదలైంది. సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ధనుష్ నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్… సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ధర్మ యోగి’ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు