ఏప్రిల్‌లో ‘మరియన్’ తెలుగు వర్షన్ విడుదల

ఏప్రిల్‌లో ‘మరియన్’ తెలుగు వర్షన్ విడుదల

Published on Mar 14, 2015 1:18 PM IST

Mariyaan-(2)

తమిళంలో ధనుష్ హీరోగా నటించగా, తెలుగులోకి డబ్ అయిన తాజా సినిమాలు ‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఈ రెండు సినిమాలతో ధనుష్‌కి తెలుగులో క్రేజ్ పెరిగింది. ఆ క్రమంలోనే ధనుష్ గతంలో నటించిన సినిమాలను తెలుగులో అనువదించే కార్యక్రమం జరుగుతోంది. మరియాన్ పేరుతో 2013లో తమిళంలో విడుదలైన సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, హిట్‌గా నిలబడింది. ఇప్పుడా సినిమాను తెలుగులోకి డబ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ బాలా దర్శకత్వం వహించారు. ఏ. ఆర్. రహమాన్ అందించిన పాటలు తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచాయి.

ఇక తాజా సమాచారం మేరకు ‘మరియాన్’ తెలుగు వర్షన్‌ను ఏప్రిల్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నారు. అంతకు ముందుగా ఈనెల 29న తెలుగు వర్షన్‌కి సంబంధించిన ఆడియో రిలీజ్‌ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన యూనిట్ మొత్తం ఈ ఆడియో వేడుకకు రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు