ఇంటర్వ్యూ : ప్రసన్న – ధరమ్ తేజ్ నా బెస్ట్ కో స్టార్ !
Published on Nov 19, 2017 5:54 pm IST

తమిళ నటుడు ప్రసన్న ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. బివిఎస్ రవి, సాయి ధరమ్ తేజ్ లు కలిసి చేస్తున్న ‘జవాన్’ లో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. డిసెంబర్ 1న చిత్ర విడుదల సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి ?
జ) ఇందులో నేను ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన బివిఎస్ రవిగారికి నా థ్యాంక్స్. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది.

ప్ర) పాత్ర ఎలా ఉంటుంది ?
జ) చాలా సినిమాలో చూసినట్టు రెగ్యులర్ విలన్ లా మాత్రం ఉండదు. కొత్తగా, భిన్నంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీదే చూడాలి.

ప్ర) ధరమ్ తేజ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) ధరమ్ తేజ్ చాలా మంచి వ్యక్తి. మొదట్లో పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాడు, ఎలా ఉంటాడో, అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ అతనితో వర్క్ చేసిన తర్వాత నేను పనిచేసిన వాళ్ళల్లో బెస్ట్ కో స్టార్ అతనే అనిపించింది.

ప్ర) విలన్ పాత్ర ఎందుకు చేయాలనిపించింది ?
జ) విలన్ పాత్రకి హద్దులు ఉండవు. హీరోకి అనేక రకాలైన లిమిటేషన్స్, రూల్స్ ఉంటాయి. విలన్ పాత్రలో అయితే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. తమిళంలో కూడా విలన్ పాత్రలు చేశాను. ప్రతినాయకుడిగా నటించడం నాకు హాయిగానే ఉంది.

ప్ర) ‘డిటెక్టివ్’ రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. దానిపై మీ ఫీలింగ్ ?
జ) ముందుగా ‘డిటెక్టివ్, దొంగోడొచ్చాడు’ సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేయాలనీ అనుకోలేదు. కానీ కుదిరేసింది. ‘డిటెక్టివ్’ కి వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తోంది. ‘జవాన్’ విడుదలయ్యాక ‘దొంగోడొచ్చాడు’ కూడా వస్తుంది. అది కూడా నాకు ముఖ్యమైన సినిమానే. అందులో కూడా నేను విలన్ గానే చేస్తున్నాను.

ప్ర) ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ?
జ) ముందు వర్క్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ముఖ్యంగా తేజ్ తో. కానీ అంతా చాలా సాఫీగా జరిగిపోయింది. తేజ్ నాకు తెలుగు కూడా నేర్పించాడు. సెట్స్ లో ఏవైనా నాకు అర్థంకాకపోతే తనే తమిళంలో వివరించి చెప్పేవాడు.

ప్ర) ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ?
జ) రవి ముందు చేసిన సినిమాల గురించి నాకు అస్సలు తేలీదు. ఒకసారి థమన్ ఫోన్ చేసి ఇలా రవి సినిమా చేస్తున్నాడు, అందులో విలన్ పాత్ర ఉంది చేస్తావా అన్నారు. సరే అని కథ విన్నాను. మొదటి సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది.

 
Like us on Facebook