“ధూత 2” వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్!

“ధూత 2” వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 17, 2024 8:19 PM IST

టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య (naga chaitanya) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ ధూత (dhootha). ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. శ్రీకాంత్ మురళి, పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్, అనీష్ కురువిల్ల, తరుణ్ భాస్కర్, రోహిణి, తనికెళ్ళ భరణి, ప్రియా భవాని శంకర్, పశుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి 19, 2024 న వెల్లడి కానుంది. ఈ వెబ్ సిరీస్ సెక్వెల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శరత్ మరార్, విక్రమ్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్ సీక్వెల్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు