‘ధృవ’ రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్..!
Published on Dec 11, 2016 12:20 pm IST

dhruva
భారీ అంచనాల మధ్యన గత శుక్రవారం ‘ధృవ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన రామ్ చరణ్, మొదటి షో నుంచి హిట్ టాక్ సంపాదించుకొని దూసుకుపోతున్నారు. కాగా కరన్సీ బ్యాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో అయితే లేవు. బీ,సీ సెంటర్లలో కాస్త కరన్సీ బ్యాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయినప్పటికీ ముందు ముందు కలెక్షన్స్ పుంజుకుంటాయని ట్రేడ్ భావిస్తోంది. రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా 16.13 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

ప్రాంతాల వారీగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 5.20 కోట్లు
సీడెడ్ 2.92 కోట్లు
ఉత్తరాంధ్ర 1.95 కోట్లు
పశ్చిమ గోదావరి 1.19 కోట్లు
తూర్పు గోదావరి
1.20 కోట్లు
కృష్ణా 1.03 కోట్లు
గుంటూరు 2.08 కోట్లు
నెల్లూరు 56 లక్షలు
మొత్తం 16.13 కోట్లు

 
Like us on Facebook