డిఫరెంట్ ప్రమోషన్స్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసాయి !

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న భారత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. దీనితోపాటు మహేష్ వాయిస్ తో విడుదల చేసిన ఆడియో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భరత్ అనే నేను” శాసనం ద్వారా నిర్మితిమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తున్నాను ” అనే డైలాగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

డిఫరెంట్ ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు విడుదల చేసిన భరత్ అనే నేను ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా నటించింది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి.