దిల్ రాజు మరో స్టార్ హీరోతో సినిమా సెట్ చేశారా ?

Published on May 3, 2021 9:01 pm IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుసగా పెద్ద సినిమాలను సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’తో పలకరించిన ఆయన రామ్ చరణ్, శంకర్ సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు. శంకర్ సినిమా అంటే బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమాను కూడ ఆయనే నిర్మిస్తున్నారు. ఇది కూడ పాన్ ఇండియా సినిమానే. ఈ రెండూ కాకుండా ఆయన ఇంకో భారీ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడ తమిళ హీరో విజయ్ తో కావడం విశేషం. విజయ్ చాన్నాళ్ల నుండి స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈమధ్యనే వంశీ పైడిపల్లి ఆయనకు కథ చెప్పారని, విజయ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దానికి దిల్ రాజుగారి నిర్మాతని వఫిల్మ్ నగర్ టాక్. ఇది తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందుతుందట. అంటే బైలింగ్వల్ ప్రాజెక్ట్. ఒకవేళ ఇదే గనుక నిజమైతే దిల్ రాజు బ్యానర్ నుండి త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావొచ్చు.

సంబంధిత సమాచారం :