మహర్షి ఫై దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు!

Published on Feb 7, 2019 4:39 pm IST


గత ఏడాది దిల్ రాజుకు అంతగా కలిసి రాలేదు. ఆయన బ్యానేర్ నుండి వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఎఫ్ 2 దిల్ రాజు కు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. 80కోట్ల షేర్ ను రాబట్టి ఆయనకు ఊహించని విజయాన్ని అందించింది.

ఇక ప్రస్తుతం దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ లో వుంది. కాగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బ్లాస్టర్ విజయం సాదిస్తుందని చాలా మంచి కంటెంట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు దిల్ రాజు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది. ఇక మహేష్ తో దిల్ రాజు తర్వలోనే మరో చిత్రాన్ని కూడా నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :