రామ్ కొత్త చిత్రానికి డైరెక్టర్ ఖరారు !

Published on Feb 13, 2019 1:11 pm IST

గత ఏడాది ఒకటే చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది రెండు సినిమాలను విడుదలచేసేట్లుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా రామ్ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం మే లో విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత రామ్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇటీవల ఆయన చెప్పిన కథ రామ్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట.

రామ్ హోమ్ బ్యానేర్ స్రవంతి మూవీస్ నిర్మించనున్న ఈచిత్రం జూన్ నుండి ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :