ఓ ఇంటివాడైన దర్శకుడు హను రాఘవపూడి!
Published on Aug 28, 2016 9:43 am IST

hanu
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, నిన్న సాయంత్రం పెళ్ళి అనే బంధంతో ఓ ఇంటివాడైపోయారు. హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో హను వివాహం ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యన వైభవంగా జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి హీరో నాని తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక హను సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్‌తో ఓ సినిమా చేయనున్న ఆయన, ఆ తర్వాత వెంటనే అఖిల్‌తో మరో సినిమా చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటు కెరీర్ పరంగా సూపర్ సక్సెస్‌లో ఉన్న హను, వ్యక్తిగత జీవితంలోనూ ఓ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సందర్భంగా ఆయనకు 123తెలుగు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేద్దాం.

 
Like us on Facebook