క్రియేటివ్ డైరెక్టర్ సినిమా పరిస్థితి ఏమిటి ?

Published on Jul 22, 2019 10:29 am IST

క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు ఉన్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడు, ఆ సినిమా చేయబోతున్నాడు, ఈ సినిమా చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి గాని, సినిమా గురించి మాత్రం అప్ డేట్స్ రావట్లేదు.

ఇటీవలే ‘రుద్రాక్ష’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా అవాస్తవమే అని కృష్ణవంశినే స్వయంగా తెలిపారు. అయితే తన తరువాత సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత బండ్ల గణేష్, కృష్ణవంశీతో ఓ సినిమా ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడో.. ఆ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు.

సంబంధిత సమాచారం :