‘విక్రమ్’ లో కీలక సీన్ పై ఇంట్రస్టింగ్ విషయం వెల్లడించిన డైరెక్టర్ లోకేష్

Published on Feb 21, 2023 8:23 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన మూవీ విక్రమ్. గత ఏడాది పలు భాషల్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఒక కీలక సీన్ లో ఫహద్ ఫాసిల్ భార్య ని విజయ్ సేతుపతి హత్య చేస్తారు.

అయితే సినిమాలో ఆమె డెడ్ బాడీని మాత్రమే చూపించాం అని, కానీ ఆ తరువాత ఆమె తలని పట్టుకుని విజయ్ సేతుపతి నడుస్తూ వస్తుంటారని, ఆ సీన్ ని తాము చిత్రీకరిచినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అది ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశ్యంతో సినిమా ఎడిటింగ్ లో ట్రిమ్ చేసినట్లు లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పారు లోకేష్ కనకరాజ్. ఇందులో ఫహాద్ భార్య గా గాయత్రీ నటించారు. కాగా లోకేష్ వెల్లడించిన వీడియోని గాయత్రీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఇక ప్రస్తుతం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హీరో విజయ్ తో లియో మూవీని డైరెక్టర్ లోకేష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :