థియేట‌ర్స్ కి “మంచి రోజులు వ‌చ్చాయి” అంటున్న మారుతి.!

Published on Jul 25, 2021 2:00 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఏక్ మినీ కథ” ఓటిటిలో సూపర్ హిట్ కొట్టిన తర్వాత మరో సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. అదే సక్సెస్ ఫుల్ దర్శకు మారుతితో చేసిన “మంచి రోజులు వచ్చాయి” సినిమా. మారుతికి సన్నిహితమే అయిన సక్సెస్ ఫుల్ నిర్మాతలు ఎస్ కె ఎన్ మరియు యూవీ కాన్సెప్ట్స్ వారితోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చెయ్యగా ఇది మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే సిద్ధం అవుతుండగా మేకర్స్ ఆ సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఈ సినిమా విడుదలపై తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర అంశాలనే వారు పంచుకున్నారు. మొదటగా హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ మళ్ళీ మారుతితో వర్క్ చెయ్యడం ఆనందంగా ఉందని ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ తప్పకుండా నచుతుంది అని తెలిపింది. అలాగే నిర్మాత ఎస్ కె ఎన్ మాట్లాడుతూ మంచి మిత్రులున్న వారికీ ఎవరికైనా మంచి రోజులు వస్తాయి అని అల్లు అరవింద్ ఆశీర్వాదాలతో ఇక్కడ వరకు రాగలిగానని ఈ సినిమా కోసం నేను చెప్పేకన్నా మారుతినే చెప్తేనే బాగుంటుంది అని తెలిపారు.

ఇంకా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ ఈ క‌రోనా సమయంలో చాలా మందిని మిస్ అయ్యాము. నా కుంటుంబ స‌భ్యులుగా భావించే బిఏరాజుగారు ఇప్పుడు మ‌నంద‌రి మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం, అలానే టీఎన్ఆర్ గారు ఇలా ఎంతో మందిని క‌రోనా ద్వారా కోల్పోవడం జ‌రిగింది. న‌వ్వు అనే విష‌యానికి దూరం అయిపోయి ఒక రక‌మైన భ‌యంలోకి వెళ్లిపోయాం. క‌రోనా రాక‌పోయినా భ‌యం అనే రోగాన్ని పెంచుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి సంఘ‌ట‌నలు చూసి నా వంతు కృషిగా ఏదైనా చేయాలి అనే అలోచ‌న నుంచి పుట్టిన సినిమానే “మంచి రోజ‌లు వ‌చ్చాయి” అని తెలిపారు. అందుకే జెట్ స్పీడ్ లో ఈ సినిమా కంప్లీట్ చేసి పూర్తి చేసి, థియేట్రికల్ రిలీజ్ కే ఫిక్స్ చేశామని తెలిపారు. ఇక ఫైనల్ గా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి ఈ సినిమాని అందరూ చూసి తీరాల్సిన సినిమాగా తీర్చిదిద్దారని తనని నమ్మిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాని తెలిపాడు. మరి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం తొందరలోనే థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :